తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పీఏసీ సమావేశం కానుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమవుతుంది. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులు తదితరులు పాల్గొంటారు. రాబోయే వంద రోజుల్లో చేపట్టబోయే రాజకీయ వ్యవహారాలు, పార్టీ చేరికలు, యాత్రలు, ఎన్నికల సభలు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, మేనిఫెస్టో, తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని సమాచారం. కర్నాటకలో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్ పెరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరికలతో పార్టీ బలోపేతంగా మారింది.
