తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, పలువురు న్యాయమూర్తులు, మంత్రులు, టీపీసీసీ రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ అరాధేకు గవర్నర్, సీఎం పుష్పగుచ్ఛాలు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
