AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం

సీనియర్‌ వైద్యుల వేధింపులే కారణమా?

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో డ్యూటీలో ఉండగా పీజీ మెడికల్‌ విద్యార్థిని ప్రమాదకర ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో సర్వత్రా సంచలనం రేపింది. సీనియర్‌ వైద్యుల వేధింపులే కారణమని చర్చ జరుగుతోంది. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ వైద్యురాలు అయిన, కాకతీయ మెడికల్‌ కళాశాలలో పీజీ అనస్తీషియా చదువుతున్న వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనస్తీషియా విభాగంలోని పీజీ విద్యార్థిని, వైద్యురాలు డాక్టర్‌ ధరావత్‌ ప్రీతి తెల్లవారుజామున విధుల్లో ఉండగా హానికరమైన ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. ఇది గమనించిన తోటి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు కాకతీయ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మోహన్‌ దాస్‌ ధ్రువీకరించారు. కాగా రెండు రోజుల క్రితం ఒక సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ ప్రీతిని వేధించినట్లుగా సమాచారం. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో కాకతీయ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వేధింపులకు గురి చేసిన వైద్యుడిని మందలించారు. అయినప్పటికీ డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అసలు ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి గల కారణాలు ఏమిటి అనేది ఇంకా పూర్తిగా తెలియ రాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రీతి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ANN TOP 10