AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీలో భూకంపం

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం భూకంపం సంభవించింది. నేపాల్‌ కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం తీవ్రత భూకంప లేఖినిపై 4.8గా నమోదైంది. నేపాల్‌లో ఈ భూకంపం తీవ్రత 5.2గా నమోదైనట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఈ ప్రభావం ఉత్తర ప్రదేశ్‌ లో కూడా కనిపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ వెల్లడిరచింది. నేపాల్‌ లోని బజురలో బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు భూకంపం సంభవించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షక, పరిశోధన కేంద్రం వెల్లడించింది.

ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు భూకంపం ప్రభావం కనిపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం హరిద్వార్‌లో ఉన్నట్లు పేర్కొంది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

ANN TOP 10