AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నడి రోడ్డుపైనే రెచ్చిపోయిన లవర్స్..

ఢిల్లీలోని ఓ రోడ్డుపై ప్రేమ జంట రెచ్చిపోయింది. యువకుడు బైక్ నడుపుతుండగా.. అతని ముందు పెట్రోల్ ట్యాంకుపై యువతి కూర్చొని.. ఆ యువకుడిని గట్టిగా కౌగిలించుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఆ బైక్ వెనకాల కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

ఈ ఘటన ఢిల్లీలోని మంగోలో‌పురి సమీపంలో ఉన్న రింగ్‌ ఫ్లైఓవర్ వద్ద జరిగినట్లు వీడియోలో కనిపిస్తున్న బోర్డు ద్వారా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు సదరు నెటిజన్ వీడియోతో పాటు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేసిన ఆ నెటిజన్.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బైక్‌పై లవర్స్ రొమాన్స్‌కు సంబంధించి వచ్చిన ట్వీట్‌పై ఢిల్లీ పోలీసులు ట్విటర్‌లోనే స్పందించారు.ఇలాంటి ఘటనలను తమ దృష్టికి తీసుకువచ్చినందుకు నెటిజన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవల ఢిల్లీ మెట్రోలో ముద్దులు, హగ్గులతో ఆగకుండా ఒకరిపై ఒకరు పడి దొర్లిన వీడియోలు బయటికి రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రద్దీగా ఉన్న రోడ్లపై బైక్‌లపై లవర్స్ చేస్తున్న ఆగడాలు అంతా ఇంతా కాదు. అయితే కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి విపరీత ధోరణులు ఈ మధ్య ఎక్కువయ్యాయి.

ANN TOP 10