AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం కేసీఆర్‌పై భద్రాచలం ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకంటే?

తెలంగాణ సీఎం కేసీఆర్ పై భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లు కట్టించి ఇవ్వడం లేదని భద్రాచలం పీఎస్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారిలా..”శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి మొదటిసారి కళ్యాణానికి వచ్చినప్పుడు 100 కోట్లతో రామాలయ అభివృద్ధి చేస్తానని అన్నారు. అలాగే గతేడాది జులై 17న సీఎం కేసీఆర్ భద్రాచలంలో పర్యటించారు. ఆ సమయంలో గోదావరి వరద నేపథ్యంలో భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణం కోసం రూ.1000 కోట్లు విడుదల చేస్తామన్నారు. బాధితులకు మరోచోట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏడాదైనా రూ.100 కూడా ఇవ్వలేదని” వీరయ్య ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ANN TOP 10