AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జోగురామన్న అవినీతికి అడ్డుకట్టవేద్దాం.. ఆదిలాబాద్‌ను రక్షిద్దాం

– కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి
– కంది సమక్షంలో భారీ సంఖ్యలో చేరికలు
ఆదిలాబాద్‌ : ఎమ్మెల్యే జోగురామన్న అవినీతి, అక్రమాలను బొందపెడితేనే ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పట్టణంలోని ఖానాపూర్, అబ్దుల్లా చౌక్‌ కాలనీ లో పర్యటించిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డిని కాలనీ వాసులు టపాసులు కలుస్తూ.. డప్పుచప్పులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఖానాపూర్, అబ్దుల్లా చౌక్‌ వార్డు నెంబర్‌ 29, 30, 31, 32 కాలనీ వాసులు భారీ సంఖ్యలో మొహమ్మద్‌ ఖలీం, జహీర్‌ పటేల్‌ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అన్యాయాలను గురించి ప్రజలకు తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ, రైతు బంధు, పోడుభూములకి పట్టాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, డబల్‌ బెడ్రూం లు ఏ ఒక్క సంక్షేమ పథకాలు అందించలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ, 15 వేల రైతు బంధు, రైతు భీమా, పోడుభూములకు పట్టాలు, స్కాలర్షిప్‌ లు, రేషన్‌ కార్డులు, 5 వేల రూపాయల పింఛన్లు, నిరుద్యోగ భృతి, ఇల్లులు కట్టిస్తదని, 18 సంవత్సరాలు నిండిన అడ బిడ్డకు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇసుందని, అలాగే వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో పని చేయాలని కోరారు.

అనంతరం కాలనీ వాసులు కంది శ్రీనివాస రెడ్డిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గీమ్మ సంతోష్, డిస్ట్రిక్ట్‌ ఐఎన్‌టీ యూసీ వైస్‌ ప్రెసిడెంట్‌ కొండూరి రవి, డిస్ట్రిక్ట్‌ మైనారిటీ సెల్‌ చైర్మన్‌ షకీల్, మాజీ కౌన్సిలర్‌ గేడం అశోక్, 24 వార్డు అధ్యక్షుడు మానే శంకర్, సాత్నాల ప్రాజెక్ట్‌ చైర్మన్‌ అల్లూరి అశోక్‌ రెడ్డి, లక్ష్మిపూర్‌ ఎంపీటీసి మనోజ్, మాజీ కౌన్సిలర్‌ ప్రభాకర్, షేక్‌ మన్సూర్‌ సీనియర్‌ నాయకులు, డిస్ట్రిక్ట్‌ అసెంబ్లీ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు అర్పత్‌ ఖాన్, చాన్‌ పాషా, రాజ్‌ మొహమ్మద్, దర్శనాల చంటి, అబ్దుల్‌ సలీం, సమీర్, జగదీష్‌ రెడ్డి, గోవర్ధన్, బాసా సంతోష్, కిజర్‌ పాషా, సమీ ఉల్లా ఖాన్, వసీమ్‌ రంజాని, అస్బాత్‌ ఖాన్, ఎల్మా రామ్‌ రెడ్డి, మొహమ్మద్‌ ముఖీమ్, రహీమ్‌ ఖాన్, షేక్‌ రహీమ్, మొహమ్మద్‌ ఆఫ్సార్, సంతోష్‌ పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ANN TOP 10