తెలంగాణలో నేటి నుంచి 10 రోజుల పాటు రైతు సభలు జరుగనున్నాయి. ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ నేతల వాక్యాలకు నిరసనగా నేటి నుంచి 10 రోజులపాటు రైతు సభలను బీఆర్ఎస్ నిర్వహించనుంది. ప్రతి వేదిక వద్ద వెయ్యి మంది రైతులతో సమావేశం నిర్వహించి, కాంగ్రెస్ కుట్రలను విడమరిచి చెప్పాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఆదేశించారు. 3 గంటల కరెంట్ కావాలా? 3 పంటలు కావాలా? అనే నినాదంతో దూకుడుగా వెళ్లాలని సూచించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు అన్ని నియోజకవర్గాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.









