AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

అమెరికాలోని అలస్కా సమీపంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. దీంతో అలస్కాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలస్కాకు సమీపంలో 9.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూఎస్జీఎస్ పేర్కొంది. అలస్కా ద్వీపం, అలేటియన్ దీవులు, కుక్ ఇంటెల్ ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అలస్కా భూకంప కేంద్రం పేర్కొంది. భూకంప క్రియాశీలక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌‌లో అలస్కా కూడా ఓ భాగం.

అలస్కాపై 1964 మార్చిలో 9.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం విరుచుకుపడింది. ఉత్తర అమెరికాలో ఇప్పటి వరకూ రికార్డయిన అతి శక్తివంతమైన భూకంపం ఇదే. ఈ భూకంపం కారణంగా సంభవించి సునామీ.. అలస్కాతో పాటు అమెరికా పశ్చిమ తీరం, హవాయిలలో పెను విధ్వంసం సృష్టించింది. నాటి సునామీ 250 మందికిపైగా పొట్టనబెట్టుకుంది.

అయితే, అమెరికా, కెనడాలోని పసిఫిక్ తీరానికి సునామీ ముప్పు లేదని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. అలస్కా అగ్నిపర్వతం అబ్జర్వేటరీ కేంద్రం షిషల్డిన్ అగ్నిపర్వతం శనివారం లావా ఎగజిమ్మినట్టు గుర్తించిన తర్వాత ఈ హెచ్చరికలను చేసింది. అలస్కా అబ్జర్వేటరీ ప్రకారం.. భూ ప్రకంపనలు స్థానిక కాలమానం సాయంత్రం 5 గంటల నుంచి పెరగడం ప్రారంభించాయి.

ANN TOP 10