AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోనాల పండుగ పూట బీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు

జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు మరో మారు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చి కార్పొరేషన్ చైర్మన్ అయిన రావుల శ్రీధర్ రెడ్డికి మధ్య కొద్దిరోజులుగా కోల్డ్ వార్ నడుస్తుంది. శ్రీధర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే టిక్కెట్‌పై కన్నెయ్యడమే ఇందుకు కారణమని పొలిటికల్ ప్రచారం. ఇక కొన్ని రోజులుగా నియోజవర్గంలో సందర్భం వచ్చిన ప్రతిసారి శ్రీధర్ రెడ్డి వర్గీయులు కడుతున్నఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్ల్యే మాగంటి ఫొటో చిన్నగా వేయడం పట్ల ప్రతిసారి గొడవ అవుతుంది.

అయితే ఈసారి ఏకంగా వెంగలరావు నగర్ డివిజన్, గణేష్ సింగ్ అనే కార్యకర్త ఇంటికి బిఆర్ ఎస్ నేత శ్రీధర్ రెడ్డి అనుకులంగా వేస్తున్న ఫ్లెక్సీల్లో తన ఫోటో చిన్నగా వేయడంపై ఆభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్.. రావుల శ్రీధర్ రెడ్డి కావాలనే ఇలా చేస్తున్నారు అంటు మండిపడుతున్నారు కానీ శ్రీధర్ రెడ్డి వర్గీయులు మాత్రం ఎమ్మెల్యే ఓర్వలేకే తన ఇంటిపై దాడికి వచ్చాడు అంటున్నారు గణేష్ సింగ్ నిన్న మొన్నటి వరకు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్‌కు ఎమ్మెల్యే కు మధ్య ఘర్షణ వాతావరణం ఉండగా తాజాగా శ్రీధర్ రెడ్డి ఎంటర్ అవ్వడంతో జూబ్లీహిల్స్ హాట్ టాపిక్ గా మారింది.

ANN TOP 10