AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ రేవంత్ రెడ్డిని సత్కరించింది. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదంతో కోవిడ్, వరదల నుంచి తెలంగాణ బయటపడిందన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఫలక్ నామా నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో మార్గాన్ని పొడగించాలన్నారు. రాష్ట్రానికి 60 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తోందన్నారు. మెట్రో నగరంగా హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు కాంగ్రెస్ సహకారం సంపూర్ణంగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ANN TOP 10