AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీకి రాగానే వరదలపై ప్రధాని మోదీ సమీక్ష

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ముగిసింది. ఫ్రాన్స్, యూఏఈ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. శనివారం అబుదాబి నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. వెంటనే దేశరాజధానిలో వరదలపై సమీక్షించారు. దేశ రాజధానిలో వరదల పరిస్థితులను ఎదుర్కోవడంలో సాధించిన పురోగతి.. ఇప్పటివరకు అందిన సహాయ సహకారాలు, తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో మాట్లాడినట్లు అధికారులు తెలిపారు.

ఈ విషయాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ట్విట్ చేసి వెల్లడించారు. “ప్రధాని నరేంద్ర మోదీ ఇంటికి చేరుకోగానే ఫోన్ చేసి ఢిల్లీలో వరదల పరిస్థితిని సవివరంగా తెలుసుకుని, అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. కేంద్రం సహాయం, సహకారంతో ఢిల్లీ ప్రజల ప్రయోజనాల కోసం సాధ్యమైన అన్ని పనులను చేయాలని ఆయన ఆదేశించారు” అని ఎల్జీ ట్వీట్ చేశారు.

భారీ వర్షాల కారణంగా.. యమునా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీరు చేరింది. వరద నీరు పోటెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే, శుక్రవారం వరకు భారీగా వరద నీరు రాగా.. శనివారం యమునా నది నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. అనేక ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో అధికారులు రోడ్లను తెరిచారు. అంతేకాకుండా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

ANN TOP 10