AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్డీఏ సమావేశానికి పవన్ కల్యాణ్‌ కు ఆహ్వానం..

వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న కసితో గ్రౌండ్ వర్క్ ను స్టార్ట్ చేసింది ఎన్డీఏ కూటమి. అందులో భాగంగా జులై 18వ తేదీన ఢిల్లీలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల అధినేతలతో మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో దేశవ్యాప్తంగా కూటమిలో ఉన్న పార్టీల మీద అభిప్రాయం ఏ విధంగా ఉంది.

ఏ రాష్ట్రంలో అయినా పరిస్థితి కష్టంగా ఉందా ? అందుకు మనము ఏమిచేస్తే పార్టీకి విజయావకాశాలు ఉంటాయి అంటూ చర్చించడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ కు చెందిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా ఆహ్వానం అందింది. ఎందుకంటే అధికారికంగా జనసేన ఎన్డీఏ కూటమిలో ఒక పార్టీ గా ఉంది. కాగా ఈ సమావేశానికి పవన్ కల్యాణ్‌ వెళ్లి తన అభిప్రాయాలను పార్టీ పెద్దలకు తెలియచేస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

ANN TOP 10