చంద్రయాన్-3 ఎలాంటి ఆటంకాలు లేకుండా కక్ష్యలోకి ప్రవేశించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన రంగం చరిత్రలో ఇది కొత్త అధ్యాయం అని అభివర్ణించారు. ప్రతి భారతీయుడి కలలు, ఆశయాలను ఉన్నతం చేసే ఘట్టం అని పేర్కొన్నారు. ఈ ఘనవిజయం మన శాస్త్రవేత్తల అంకితభావానికి నిదర్శనం అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం చేస్తున్నానని తెలిపారు.
