AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రయాన్‌ 3 ప్రయోగానికి ఖర్చు ఎంతో తెలుసా?

చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం అయింది. దీంతో శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్‌-3 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని మిషన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరింది. చంద్రయాన్‌-3లో ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కిలోగ్రాములు.

చంద్రయాన్‌-3 మిషన్‌ కోసం అంచనా వేసిన బడ్జెట్‌ రూ.600 కోట్లు. అయితే దీన్ని కాస్త పెంచడంతో చివరి బడ్జెట్‌ రూ.615 కోట్లకు చేరింది. అయితే చంద్రయాన్‌-2తో పోలిస్తే ఈ బడ్జెట్‌ ఇప్పటికీ చాలా తక్కువ. ఎందుకంటే.. చంద్రయాన్‌-2 మిషన్‌ బడ్జెట్‌ దాదాపు 978 కోట్ల రూపాయలు. చంద్రయాన్‌-3 తక్కువ ధరకు ప్రధాన కారణం అది ఆర్బిటర్‌ను ఉపయోగించకపోవడమే. ఆర్బిటర్‌కు బదులుగా.. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ఉపయోగించబడిరది. ఆర్బిటర్‌తో పోలిస్తే దీని నిర్మాణానికి తక్కువ ఖర్చు అవసరం అవుతుంది. అందుకే ఈ ప్రచార బడ్జెట్‌ కూడా తగ్గింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10