AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీనన్న స్పీచ్‌లకు జనం ఫిదా

కంది మాట.. జనం బాట
రోజురోజుకు పెరుగుతున్న క్రేజ్‌

ఆదిలాబాద్‌: కంది శ్రీనివాస రెడ్డి స్పీచులకు జనం ఫిదా అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన తూర్పారబట్టడం చూసి అభిమానంతో చప్పట్లు కొడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం నవేగం గ్రామంలో జరిగిన ప్రజా గోస బీజేపీ భరోసా శక్తి కేంద్ర కార్నర్‌ మీటింగ్‌ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలను ప్రజల వద్ద ఎండగట్టారు. డబుల్‌ బెడ్రూం లు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, నిరుద్యోగ భృతి, దళిత బంధు, బీసీ బంధు,రైతు రుణమాఫి అని అబద్ధపు హామీలతో మోసం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ,బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం అన్నారు.కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబెర్‌ జి వి రమణ , ఇచ్చోడ మండల వైస్‌ ప్రెసిడెంట్‌ ముండే నానాజీ, మండల అధ్యక్షులు కేంద్రే నారాయణ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాము, జిల్లా అధ్యక్షులు మాధవ్‌ హాంటే, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే మనజీ, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు మచ్చ అజయ్‌ , బీజేపీ కార్యకర్తలు అశోక్‌, భారత్‌, తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10