AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూడు చెరువుల నీళ్లు తాగినా బీఆర్‌ఎస్‌కు అధికారం కల్ల

బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఎంత దుష్ప్రచారం చేసినా రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు గంటలు అని కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని, మూడు చెరువుల నీళ్లు తాగినా మళ్లీ అధికారంలోకి రావడం కల రేవంత్ అని చురకలంటించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. అమెరికాలోని తానా సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆ పార్టీ “సత్యాగ్రహ దీక్ష” పిలుపును నీరుగార్చాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఉచిత విద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుంది. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది.

ANN TOP 10