AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విఘ్నేష్‌.. నయనతారతో జర జాగ్రత్త.. షారుఖ్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌

దర్శకుడు, నయనతార భర్త విఘ్నేష్ శివన్‌.. సోషల్ మీడియా వేదికగా జవాన్‌ టీమ్‌కు విషెస్ తెలుపుతూ స్పెషల్ నోట్ షేర్ చేశాడు. అయితే, ఈ పోస్ట్‌కు రిప్లయ్ ఇచ్చిన షారుఖ్.. నయనతార గురించి ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేశారు. అంతేకాదు తనతో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని విఘ్నేష్‌ను హెచ్చరించారు.

‘జవాన్ ప్రివ్యూ’ విడుదలైన తర్వాత శివన్ తన భార్య నయనతార బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశాడు. ‘అట్లీ ఇలాంటి అద్భుతమైన సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంటే గర్వపడకుండా ఎలా ఉండగలం! అవుట్‌పుట్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంది. అవిశ్రాంత ప్రయత్నాలు, సహనం, కృషికి ఇది నిదర్శనం! హ్యాట్సాఫ్!’ అంటూ పోస్ట్ చేశాడు. అలాగే ‘షారుఖ్ ఖాన్‌ మూవీలో డ్రీమ్ డెబ్యూ అవకాశాన్ని పొందిన నయనతార, అనిరుధ్‌కు అభినందనలు. విజయ్‌ సేతుపతి సార్‌కి వందనాలు’ అంటూ ముగించాడు. అయితే ఈ స్పెషల్ నోట్‌ను షారుఖ్ రీట్వీట్ చేస్తూ రిప్లయ్ ఇచ్చారు.

విఘ్నేష్‌ శివన్ చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నయనతార అద్భుతంగా ఉంది. అయితే నేను చెప్పబోయేది మీకు ముందే తెలుసనుకుంటా! కానీ జాగ్రత్త. ఆమె ఇప్పుడు కొన్ని భారీ కిక్స్, పంచ్‌లు నేర్చుకుంది’ అని ఫన్నీగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. నిజానికి షారుఖ్ ఖాన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈసారి నయనతార భర్త విఘ్నేష్ శివన్‌‌కు జాగ్రత్తలు చెప్పడంలో ఆయన చూపిన కామిక్ టైమింగ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ANN TOP 10