వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది. కాగ్నా నది బ్రిడ్జికి ఉరి వేసుకొని కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు చించోలి తాలూకా అంపల్లి గ్రామానికి చెందిన నగేష్‌గా పోలీసులు గుర్తించారు. అలాగే అతడు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









