AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జనసేన కార్యకర్త చెంప చెల్లుమనిపించిన లేడీ సింగం

శ్రీకాళహస్తిలో జనసేన చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జనసైనికులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ తరుణలో భాగంగా సీఎం దిష్టిబొమ్మ దహనానికి వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో దిష్టిబొమ్మ దహనానికి తాము అనుమతించబోమని సీఐ అంజు యాదవ్ వారికి చెప్పారు. అయినప్పటికీ వారు దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో ఒక నేత చెంపలపై ఆమె కొట్టారు. ఈ సఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మహిళా సీఐ తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10