AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళను ముక్కలు ముక్కలుగా నరికి…

మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్లైఓవర్ సమీపంలో పడేసిన సంఘటన ఢిల్లీలోని గీతా కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహిళ మృతదేహం శరీర భాగాలు వివిధ ప్రదేశాలలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫ్లైఓవర్ సమీపంలో వివిధ ప్రదేశాలలో ముక్కలు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తూర్పు ఢిల్లీలో మహిళలు అదృశ్యమైన వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మహిళ మృతదేహం ఎవరిదో తెలిస్తే విచారణం చేయడం సులభం అవతుందని పోలీసులు వెల్లడించారు.

ANN TOP 10