AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంట్రెస్టింగ్ గా ‘సుందరం మాస్టర్’ టీజర్ రిలీజ్!

ప్రముఖ కమెడియన్ హర్ష- దివ్య శ్రీపాద ప్రధానమైన పాత్రలను పోషించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రానికి హీరో రవితేజ – సుధీర్ కుమార్ నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా కల్యాణ్ సంతోష్ పరిచయమవుతున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి, సాయితేజ్ చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. అడవికి సమీపంలోని ఒక గిరిజన గూడెంలో ఈ కథ నడవనున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. అక్కడి ప్రజలకు ఇంగ్లిష్ నేర్పించడానికి హర్ష ట్రై చేస్తే, వాళ్లు తన కంటే ఫాస్టుగా ఇంగ్లిష్ మాట్లాడటంతో ఆయన బిత్తరపోతాడు. కామెడీనే ప్రధానంగా ఈ కథ ముందుకు నడుస్తుందని అర్థమవుతోంది.

ANN TOP 10