AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోగత జలపాతం.. భయంకరంగా వరద ప్రవాదం..

తెలంగాణలోని ప్రత్యేక గుర్తింపు పొందిన బోగత జలపాతాలు ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద జలపాతాలు పరవళ్ళు తొక్కుతున్నాయి. అత్యంత ప్రమాదకరంగా వరద ఉదృతి కొనసాగుతుండడంతో సందర్శకులను అనుమతించడం లేదు. ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరద ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో సందర్శకులను జలపాతాలలో దిగడానికి అనుమతించడం లేదు. దాంతోపాటు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు.

గతంలో చోటు చేసుకున్న ప్రమాదాలను ఉదహరిస్తూ.. పర్యాటకులు లోనకు వెళ్లొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు. ప్రవాహం భీకరంగా ఉండటంతో అందులోకి దిగితే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న బోగత జలపాతం.. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది.

ANN TOP 10