ఉస్మానియా డాక్టర్లు (Osmania doctors) హిమాచల్ వరదల్లో (Himachal floods) చిక్కుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ మనాలిలో హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు డాక్టర్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు డాక్టర్ల ఫోన్స్ స్విచ్చాఫ్ అయినట్లు సమాచారం. డాక్టర్ల పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల ఆచూకీ కోసం తెలంగాణ డాక్టర్ల సంఘం ఢిల్లీ రెసిడెంట్ కార్యాలయాన్ని సంప్రదించింది. డాక్టర్ బానోత్ కమల్ లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్ వరదల్లో చిక్కుక్కున్నారు.









