ఒక కేజీ టమోటా ఏకంగా రూ. 150 నుంచి 200 దాకా పలుకుతున్న నేపథ్యంలో సామాన్యుడికి గుదిబండగా తయారయింది. దీనితో టమోటాలు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు పేద ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటకలో 2 వేల కిలోల టమాటలను చోరీ చేశారు. కర్ణాటకకు చెందిన చిత్రదుర్గ ప్రాంతంలోని రైతు తాను పండించిన 2 వేల కిలోల టమోటాను కోలార్ మార్కెట్ కు తరలించే ప్రక్రియలో ముగ్గురు దుండగులు అతని వాహనాన్ని ఫాలో చేస్తూ వచ్చి.. ముందుగా వారు మా కారును ఢీ కొట్టారని వాదనకు దిగి, టమోటా రైతును, డ్రైవర్ ను కొట్టారు. ఆ తర్వాత రైతు, డ్రైవర్ ఇద్దరినీ అక్కడే వదిలేసి ఆ లోడ్ తో అక్కడి నుండి పరారయ్యారు. ఇప్పుడు రైతు వాహనం యొక్క డ్రైవర్ సమాచారం మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తును స్టార్ట్ చేశారు. టమోటాలు కోసం దొంగతనాలు చేసేంత స్థాయికి వెళ్లిపోయారంటే దీని విలువ ఏమిటో అర్ధమవుతోంది.









