AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ 6 నెలలు ఎంతో కష్టపడ్డా.. సమంత ఎమోషనల్ పోస్ట్‌

మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడిన సమంత.. అంతకుముందే కొన్ని నెలలు రెస్ట్ తీసుకోగా, ఇప్పుడు మరోసారి ఓ సంవత్సరం పాటు రెస్ట్ తీసుకోవడానికి రెడీ అయిందని విన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా సమంత పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో కారవాన్‌ ఫొటో పోస్ట్ చేసిన సమంత.. మరో మూడు రోజులు మాత్రమే ఈ కారవాన్‌లో ఉండేది అంటూ ట్యాగ్ చేసింది. అంటే తాను ఇక రెస్ట్ మోడ్ లోకి వెళ్ళబోతున్నట్లు ఆమె పరోక్షంగా వెల్లడించింది.

అదేవిధంగా ఈ ఆరు నెలలు చాలా కష్టంగా గడిచాయి.. ఇక దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది అంటూ సమంత పెట్టిన మరో పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె ఇలాంటి పోస్ట్‌ పెట్టడానికి కారణమేంటి అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ANN TOP 10