ఆమస్టర్‌డామ్: మిస్ నెదర్లాండ్స్ టైటిల్‌ను తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ గెలుచుకున్నది. ఆ ఘనతను తన ఖాతాలో వేసుకున్నది. అందగత్తెల పోటీల్లో ట్రాన్స్‌జెండర్ మహిళ ఆ టైటిల్‌ను దక్కించుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. 22 ఏళ్ల రిక్కీ వలేరి కొల్లే పోటీల్లో మేటి మోడల్స్‌ను ఓడించింది. ఆమస్టర్‌డామ్‌లో జరిగిన కార్యక్రమంలో రిక్కీ విజేతగా నిలిచింది. దీంతో ఎల్ సాల్వడార్‌లో జరగనున్న 72వ మిస్ యూనివర్స్ పోటీలకు ఆమె ఎంపికైంది.









