AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెదక్‌ కస్టోడియల్‌ డెత్‌పై హైకోర్టులో విచారణ

మెదక్‌లో జరిగిన కస్టోడియల్‌ డెత్‌ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఖదీర్‌ ఖాన్‌ మృతిపై హైకోర్టు సుమోట గా కేసు స్వీకరించిన విషయం విదితమే. గత నెల 27 న చైన్‌ స్నాచింగ్‌ కేస్‌ లో ఖదీర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నెల 3న పోలీస్‌ కస్టడీ నుంచి బయటకు వచ్చినట్టు అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌.. హైకోర్టు కు తెలిపారు. ఈ నెల 16 న గాంధీ లో చికిత్స తీసుకుంటూ ఖదీర్‌ మృతి చెందారు. ఖాదర్‌ మృతిపై మీడియాలో వచ్చిన కధనాల ఆధారంగా హైకోర్టు సుమోటో గా స్వీకరించారు. డీజీపీ, మెదక్‌ ఎస్పీ, హోం శాఖ కార్యదర్శి, మెదక్‌ సీఐ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చ్‌ 14 కు వాయిదా వేసిన హైకోర్టు పేర్కొంది.

ANN TOP 10