AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కడియం శ్రీహరిపై రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చాలా కాలంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తుండగా.. కొన్ని రోజులుగా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే ఘాటు విమర్శలు చేసుకుంటూ.. రచ్చకెక్కారు. తాజాగా కడియం శ్రీహరిపై రాజయ్య తన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత విమర్శలతో పాటు సంచలన కామెంట్లు చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య.. కడియం శ్రీహరి తల్లి, కూతురిపై కీలక వ్యాఖ్యలు చేయగా.. జనగామ జిల్లా జఫర్‌ఘడ్ మండలం హిమ్మత్‌నగర్‌లో సంచలన కామెంట్లు చేశారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ ఆరుద్ర పురుగుల్లా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయని రాజయ్య ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కాకముందు కడియం ఇంటి కిటికీలకు గోనె సంచులు ఉండేవని.. ఇప్పుడు ఇంతగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగలమన్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు కడియం ఏం పని చేశాడో.. అన్నీ తనకు తెలుసని… తన దగ్గర ఒక పుస్తకం కూడా ఉందన్నారు. దాన్ని అవసరం వచ్చినప్పుడు తీసి.. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ బయటపెడతానంటూ చెప్పుకొచ్చారు. నువ్వు నిజమైన బీఆర్ఎస్ పార్టీ నాయకుడివైతే రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టు. నువ్వు నేను చూసుకుందాం. అంటూ కడియంకు రాజయ్య సవాల్ విసిరారు.

ANN TOP 10