AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాజీ మంత్రి చంద్రశేఖర్‌తో ఈటల రాజేందర్ భేటీ

బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ పార్టీ మారుతున్నట్టు వార్తలు ప్రచారమవుతున్న నేపథ్యంలో.. బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్.. ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ మార్పు వార్తలతో పాటు పార్టీ విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం మాట్లాడిన ఈటల రాజేందర్.. చంద్రశేఖర్ అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే అయ్యారు. మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు చంద్రశేఖర్. తెలంగాణ ఉద్యమంలోనూ కలిసి పనిచేశాం. ఏ, బీ, సీ, డీ వర్గీకరణకు బీజేపీ కమిట్‌మెంట్‌తో ఉందన్న ఈటల.. ఈ విషయంపై అధిష్ఠానంతో చర్చలు జరుపుతామన్నారు. కర్ణాటకలో హామీ ఇచ్చామని.. తెలంగాణలో కూడా వర్గీకరణకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.

చంద్రశేఖర్‌కు తనకు కామన్ ఎజెండా ఉందని ఈటల రాజేంద్ర తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించటమే తమ ప్రధాన ఎజెండ్ అని.. అందుకోసం ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చారు. పార్టీని వీడుతారని మీడియాలో కొంత మంది పనికట్టుకుని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మాజీ మంత్రి డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారటం లేదని చెప్పుకొచ్చారు. పార్టీ బాగుండాలని చర్చించినట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పదవులకు రాజీనామా చేసి కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సమాజం బాగుపడాలని చర్చించినట్టు తెలిపారు.

ANN TOP 10