AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంబులెన్స్‌లో మృత్యువుతో రోగి పోరాటం.. అంతలోనే..

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని 108 సిబ్బంది అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆస్పత్రికి చేరుకుంటామనగా..కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి వద్దకు రాగానే అటు నుంచి రైలు వస్తోందని, రైల్వే సిబ్బంది గేట్లు వేశారు. దీంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. వాటితో పాటు అంబులెన్సు కూడా ఆగిపోవాల్సి వచ్చింది.

అయితే అంబులెన్సులో ఉన్న రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ముందుకు వెళ్దామంటే… రైల్వే గేటు పడి వాహనాలు ఆగిపోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే అంబులెన్స్ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి రోగి ప్రాణాలు కాపాడారు. ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తికి సకాలంలో సీపీఆర్ చేసి అతడికి ప్రాణాలు పోశారు. రైల్వే గేటు తెరుచుకున్న వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి అతడి ఊపిరి నిలిపారు.

ANN TOP 10