AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు షురూ..

27న ఎదుర్కోలు, 28న కల్యాణం, మార్చి 1న రథోత్సవం
పట్టు వస్త్రాలు సమర్పించనున్న కేసీఆర్‌ దంపతులు

హైదరాబాద్‌ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 3 వరకు 11 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు మంగళవారం ఉదయం 10 గంటలకు ఆగమ శాస్త్ర రీతిలో శ్రీకారం చుట్టారు. స్వామివారి విశేష అలంకారాలు, దివ్యవాహన సేవలు ఆలయ పునర్నిర్మాణం అనంతరం తొలిసారిగా ఈ ఏడాది ప్రధానాలయ ప్రాంగణంలోనే జరుగుతుండటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించేకునేలా చలువ పందిళ్లు, విద్యుత్‌ కాంతులు విరజిల్లేలా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు హాజరుకానుండడంతో అందుకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. ఈ నెల 28న నిర్వహించే తిరుకల్యాణ వేడుకలకు సీఎం కేసీఆర్‌ దంపతులు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉత్సవాల చివరి రోజు 3న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రికి డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10