యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి భక్తులకు మూడు గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తజనులు శ్రీవారి ఆలయంలో జరుగు నిత్యపూజలలో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకుంటున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయం తెరిచిన ఆర్చకులు సుప్రభాత సేవతో ఆలయ పూజలకు శ్రీకారం చుట్టారు. కాగా, పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.









