AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాహుల్‌కు షర్మిల ఎమోషనల్ థాంక్స్.. పార్టీ విలీనం కన్‌ఫాం అయినట్టేనా?

అధికార పార్టీపై మొదటి నుంచి నిప్పులు చెరుగుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా వైఎస్ షర్మిల కూడా నడుచుకోవటం ఆసక్తికరంగా మారింది. మరోసారి రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు షర్మిల ఎమోషనల్ రిప్లై ఇవ్వటంతో మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ.. ఆయనను కొనియాడుతూ ట్వీట్ చేశారు. తన ఫొటోతో పాటు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన దార్శనిక నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ రాహుల్ కొనియాడారు. ఎల్లప్పుడూ గుర్తుచుకునే నాయకుడు వైఎస్సార్ అంటూ ప్రశంసించారు. ఆయన జయంతి సందర్భంగా.. ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. కాగా.. రాహుల్ చేసిన ఈ ట్వీట్‌కు వైఎస్ షర్మిల.. థాంక్యూ చేప్తూ ఎమోషనల్ రిప్లై ఇచ్చారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆప్యాయతతో ఆయనను స్మరించుకున్నందుకు థాంక్యూ రాహుల్ గాంధీ జీ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. అంతేకాదు.. తెలుగు ప్రజలకు సేవ చేస్తూనే చివరి శ్వాస విడిచిన కమిటెడ్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీకి ఇంతలా ధన్యవాదాలు చెప్పటం వెనుక ఇక ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటం ఖాయంగానే కనిపిస్తోందని.. ఇన్ని రోజులు నాన్చుతూ వస్తున్న ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టే ముహూర్తం దగ్గర పడిందంటూ తెలంగాణ రాజకీయాల్లో వార్తలు ఊపందుకున్నాయి.

ANN TOP 10