AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లడ్డూ గుజరాత్‌కు.. పిప్పర్‌మెంట్ తెలంగాణకా?.. హరీష్ సెటైర్లు

హనుమకొండలో బీజేపీ నిర్వహించిన విజయసంకల్ప సభలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నీతి ఆయోగ్ చెప్పినా తెలంగాణకు నిధులు ఇవ్వలేదని, బీజేసీ సర్కార్‌ను ప్రశ్నిస్తే ఈడీని ప్రయోగిస్తారని ఆరోపించారు. మీకు ఈడీలు, సీబీఐ ఉంటే మాకు ప్రజలు ఉన్నారుని హరీష్ తెలిపారు. లడ్డూ గుజరాత్‌కు, పిప్పర్‌మెంట్ తెలంగాణకు ఇచ్చారని, కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారని విమర్శించారు. తెలంగాణకు మోదీ ప్రత్యేక నిధులు ఏమీ ఇవ్వలేదని, తెలంగాణకు రావాల్సిన నిధులను మోదీ ఆపారని హరీష్ ఆరోపించారు.

కేసీఆర్‌ను తిట్టడం తప్ప తెలంగాణకు మోదీ ఒరగబెట్టింది ఏమీ లేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. మోడీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చారన్నారు. అటు కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై కేంద్రం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ANN TOP 10