వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. శనివారం కడప జిల్లా ఇడుపులపాయలోని ఘాట్ వద్ద అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. కుమారుడు, కుమార్తెతో కలిసి వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్సాఆర్ లోకాన్ని వదిలివెళ్ళినా.. ప్రతి పేదవాడి చిరునవ్వులోనూ బతికే ఉన్నారని షర్మిల అన్నారు. రైతులు, ఆడబిడ్డల అభ్యున్నతి కోసం వైఎస్సాఆర్ కన్న ప్రతి కలను నెరవేరుస్తానని చెప్పారు.









