
కొత్త బాధ్యతలతో అడుగుపెట్టిన ఈటలకు ఘన స్వాగతం
బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కొత్త బాధ్యతలతో తొలిసారి హుజురాబాద్ గడ్డ పై అడుగుపెట్టిన సందర్భంగా ఘన స్వాగతం పలికారు. ఈటల రాజేందర్ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని రాష్ట్రం అంతా ఎదురుచూస్తోందని అన్నారు. మీ బిడ్డగా మీరు గర్వపడేలా రాబోయే ఎన్నికల్లో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు ఒక సైనికునిలా పోరాడుతానని స్పష్టం చేశారు. బీజేపీని నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.









