AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోరున ఏడ్చిన ఎమ్మెల్సీ కవిత..

ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన గాయకుడు సాయిచంద్ కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. గురువారం సాయిచంద్ ఇంటికి వెళ్లిన కవితని చూసిన ఆయన భార్య రజని బోరున విలపించింది. ఆమెను ఓదార్చే క్రమంలో కవిత సైతం భావోద్వేగానికి గురయ్యారు.

ఈ క్రమంలో కవిత కూడా కన్నీరు పెట్టుకున్నారు. సాయిచంద్ చిన్నవయసులోనే వెళ్లిపోయాడని రోదిస్తున్న రజనీని కవిత ఆలింగనం చేసుకొనిఓదార్చే ప్రయత్నం చేశారు. అయినా ఆమె తన ఏడుపును ఆపలేదు. మనసులో ఉన్న బాధను కవితకు చెప్పుకుంటూ గుండెలు పగిలేలా సాయిచంద్ భార్య రజని రోదించింది. ఆ తరువాత కవిత చేయి పట్టుకొని సాయిచంద్ తో ఉన్న జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారామే.

ANN TOP 10