AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీమ్‌ ఇండియా గ్రాండ్‌ విక్టరీ

న్యూఢిల్లీ: ఆసీస్‌పై రెండో టెస్ట్‌లోనూ భారత్‌విజయం సాధించింది. బోర్డర్‌.. గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ ఇండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా అనూహ్య రీతిలో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు వెనుకబడిన భారత్‌.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసి మరీ గెలవడం విశేషం.

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇచ్చిన 115 పరుగుల టార్గెట్‌ ను టీమిండియా అవలీలగా ఛేదించింది. ఆస్ట్రేలియాపై 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది టీమ్‌ ఇండియా. ఇక టీమ్‌ ఇండియా బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 31 పరుగులు, పూజార 31 పరుగులు, కే ఎస్‌ భరత్‌ 23 పరుగులు, కోహ్లీ 20 పరుగులు, శ్రేయస్‌ అయ్యర్‌ 12 పరుగులు చేశారు. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో భారత్‌ అదరగొట్టింది. దీంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌ లో 2-0 లీడ్‌ సాధించింది. వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించడంతో భారత్‌ జట్టు టెస్ట్‌ క్రికెట్‌ లో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది.

ANN TOP 10