AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైఎస్‌ షర్మిల అరెస్ట్‌

మహబూబాబాద్‌: వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో మహబూబాబాద్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. షర్మిల పాదయాత్రను రద్దు చేసి ఆమెను అరెస్ట్‌ చేసిన అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.

ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం ఉదయం మరిపెడ.. మహబూబాబాద్‌ హైవేపై బేతోలు వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు,నేతలు రాస్తారోకో చేపట్టారు. షర్మిలను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో షర్మిల పాదయాత్రకు అనుమతిని రద్దు చేసి ఆమెను అరెస్టు చేశారు. ఆమె శనివారం సాయంత్రం ఓ బహిరంగ సభలో మహబూబాబాద్‌ ఎంఎల్‌ఏ బి.శంకర్‌ నాయక్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అవినీతికి, భూఆక్రమణలకు పాల్పడ్డారంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారని తెలిసింది.

ANN TOP 10