AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిమింగలం పొట్టలో 3 కోట్ల నిధి

స్పెయిన్‌లోని లా పాల్‌మాలోని నొగాలస్‌ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన స్పెర్మ్‌ జాతి తిమింగలం కళేబరంలో సైంటిస్టులు నిధిని కనుగొన్నారు. నిధి అంటే బంగారం, వెండి కాదు.. సముద్రంలో తేలే బంగారంగా పిలిచే తిమింగలం వాంతి అది. లాస్‌ పాల్మస్‌ యూనివర్శిటీ, జంతు పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో తిమింగలం మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి అటాప్సీ నిర్వహించగా, తిమింగలం పొట్టలో వారికి అరుదైన నిధి లభించింది. సుమారు 9.5 కేజీల బరువున్న అంబెర్‌గ్రిస్‌ను పొట్ట నుంచి వెలికి తీశారు. దాని విలువ సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు.

ANN TOP 10