AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అభిమానులకు నిఖిల్ సారీ.. క్షమించాలంటూ లేఖ విడుదల..

టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ గతేడాది కార్తికేయ 2 మూవీతో వచ్చి ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన స్పై మూవీతో వచ్చాడు. ఈ నేపథ్యంలో నిఖిల్ అభిమానులను క్షమాపణలు కోరుతూ ఓ లేఖ విడుదల చేసారు. ఈ సందర్భంగా నిఖిల్.. తను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’ మూవీ అనుకున్న విధంగా వివిధ భాషల్లో అనుకున్న సమయానికి విడుదల చేయకలేపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

నిఖిల్ మాట్లాడుతూ..స్పై మూవీ అనుకున్న సమయం కంటే ఓవర్సీస్‌లో 350 స్క్రీన్స్‌లో ప్రీమియర్స్ కాన్సిల్స్ అయ్యాయి. అందుకు విచారం వ్యక్తం చేసారు. ఇకపై చేయబోయే సినిమాల కంటెంట్‌పై మరింత దృష్టి పెడుతానన్నారు. నిఖిల్ స్పై మూవీకి వచ్చిన టాక్ నేపథ్యంలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాలేదు. అంతేకాదు 350 ప్రీమియర్స్ కూడా రద్దు చేయబడ్డాయి. దీంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌కు హ్యూజ్ రెవెన్యూ లాస్ వచ్చింది. ఈ సినిమాకు కథ బాగున్నా.. సరైన విధంగా తెరకెక్కించలేకపోవడం.. హడావుడిగా క్లైమాక్స్ ఉండటం వంటివి ఈ సినిమాకు మైనస్‌గా మైనస్‌గా మారాయని అన్నారు.

ANN TOP 10