AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఛత్రపతి ఆశయాలే లక్ష్యం కావాలి


ఉద్యమ స్ఫూర్తి రగిల్చిన శివాజీ
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి

ఆదిలాబాద్‌: ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలకనుగుణంగా నడుచుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వేడుకల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ శివాజీ చౌక్‌ లో గల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువనేత కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ దేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ చేసిన సేవలను కొనియాడారు.

ఎన్నో గొప్ప ఉద్యమాలకు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్ఫూర్తి అని అన్నారు. స్వరాజ్యం సురాజ్యం అన్న నినాదంతో భారతీయుల్లో ఉద్యమ స్ఫూర్తి రగిల్చిన మహనీయుడని వ్యాఖ్యానించారు. అందరూ ఆయన ఆశయాలకనుగుణంగా నడుచుకోవాలని కోరారు. ప్రజలందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కంది శ్రీనివాస రెడ్డి ఆయన వెంట ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగర్కర్‌ శంకర్‌, కిష్టా రెడ్డి, రాజ్‌ కుమార్‌, రవి కిరణ్‌ రెడ్డి, సంతోష్‌ రెడ్డి, సంజీవ్‌, రిషి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ANN TOP 10