బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చూపించే అభిమానం గురించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ ని ఓ దేవుడిగా భావిస్తాడు. భక్తుడిగా నిరంతరం అభిమానం రూపంలో పూజిస్తాడు. పవన్ ముందుంటే ఓసాధారణ అభిమానిలా మారిపోతాడు. ఆరకంగా ఇండస్ట్రీ నుంచి తానో ప్రత్యేక అభిమానిగా కనిపిస్తాడు. తాజాగా గురుపౌర్ణమిని పురస్కరించుకుని గురువు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
`మా గురువుకి గురుపౌర్ణమి శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. కృషితో మీరు అనుకున్నవన్నీ సాధించాలి. మీస్థానం..స్థాయి తెలిసినవాడిగా చెబుతున్నా. ఏ విధంగానూ మీ కీర్తిని వాడుకుని లబ్ది పొందను. వీలైతే సాయంగా ఉంటాను. లేకపోతే దూరంగా ఉంటాను. అంతే కానీ మీ పేరుతో ఎలాంటి లబ్ది పొందను. నా ఆశ ఒక్కటే. మీ ఆశయం నెరవేరాలి. నిస్వార్ధమైన మీ మనసులాగే మీరు పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా` అని ట్వీట్ చేసారు.
ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. గణేష్ ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ బ్రాండ్ ని వినియోగించుకుని ఆయన ఏదైనా వ్యక్తిగత లబ్ది పొందాడా? వాటికి వివరణగానే ఇలా స్పందించాడా? అంటూ మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి.









