తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) స్థానంలో కిషన్ రెడ్డికి హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ (Etela Rajender) ను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇక బీజేపీలో ఈటెలకు కీలక పదవి అప్పగించడంతో ఆయన పంతం నెగ్గించుకున్నారు. ఇదే సమయంలో ఇకపై ఆయన రాష్ట్రంలో చక్రం తిప్పబోతున్నారా అనేది చూడాలి.









