ఆదిలాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అత్యవసర సమయాలలో ఉచిత ఆంబులెన్స్ సేవలు అందిస్తున్నారు. నిత్యాన్నదానంతో పేదల ఆకలి తీర్చడమే కాకుండా కష్టాలలో ఉన్నవారికి ఆర్థిక సాయాలు అందిస్తూ తానున్నానన్న భరోసా కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని నీటి ఎద్డడి గల పలు కాలనీలకు మండువేసవి కాలం నుంచి నిరంతరాయంగా నీటిట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. జనహృదయ నేతగా అందరి హృదయాల్లో చోటుసంపాదించుకుంటున్నారు కంది శ్రీనన్న.









