విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) కేసుకు సంబంధించి రిలయల్స్ ఏడీఏ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇదే కేసుకు సంబంధించి అనిల్ అంబానీ ఈడీ అధికారుల ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు.
మంగళవారం టీనా అంబానీ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. టీనా అంబానీ ఈ వారంలో మరోసారి ఈడీ ఎదుట హాజరుకావలసి ఉంటుంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధిచి వివిధ సెక్షన్ల కింద అనిల్ అంబానీపై తాజాగా కేసు మోదైంది. సోమవారం ఉదయం 10 గంటలకు దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరైన అనిల్ సాయంత్రం 5 గంటల వరకు విచారణను ఎదుర్కొన్నారు.









