AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేంద్ర మంత్రిగా బండి సంజయ్?..ఈటలకు ఇచ్చే పదవి ఇదే..!

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంపై బీజేపీ అదిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. త్రిముఖ వ్యూహంతో బీజేపీ ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా భారీ మార్పులకు అదిష్ఠానం రెడీ అయింది. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను ఆ పదవి నుంచి తప్పించున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించి కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోనున్నారనే ప్రచారం జరుగుంతోంది. సంజయ్‌కు కేంద్రమంత్రి లేదా సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పార్టీ కోర్ అజెండాను జనాల్లోకి తీసుకెళ్లాలా ఫ్లాన్ చేస్తున్న బీజేపీ అందులో భాగంగా.. సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. సంజయ్‌కు ఆర్ఎస్‌ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉండగా.. ఆయనకు మంత్రి పదవిని కట్టబెడితే హిందుత్వ అజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాడని అదిష్ఠానం విశ్వసిస్తోనట్లు తెలుస్తోంది. దాంతో పాటు మంత్రిగా ఆయనకు ఉండే ప్రోటోకాల్, ప్రసంగాలు ఎన్నికల్లో పార్టీకి మైలేజీ ఇచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ పాకెట్ మనీ ఇస్తున్నారు: బండి సంజయ్

సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు. దాంతో పాటు 40 ఏళ్లుగా పార్టీతో ఆయనకు అనుబంధం ఉంది. ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.. అందరిని కలుపుకుని పోవటంతో పాటు.. తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి దగ్గర కావొచ్చునని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. అందులో భాగంగా ఆయన్ను కేంద్ర కేబినెట్ నుంచి తప్పించి రాష్ట్ర బాధ్యతలు అప్పగించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీలో కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఈటల రాజేందర్‌కు కూడా కీలక పదవి కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉండగా.. ఆ పదవితో వచ్చేందే లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటలకు ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సరిసమానమైన.. ఈ బాధ్యతకు ఆయనే సరైన వ్యక్తని పార్టీ భావిస్తోంది. ఈటలకు ఉన్న మాస్ ఇమేజ్, బీసీ నేతగా గుర్తింపు, ఉద్యమ నేతగా ప్రజలతో ఉన్న అనుబంధం పార్టీకి కలిసొస్తుందని బీజేపీ అదిష్ఠానం భావిస్తోంది. అందులో భాగంగా ఆయనకు ఈ పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుండగా.. భేటీ తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10