ఒకప్పుడు ఓపెన్ సర్జరీల…ఇప్పుడంతా రోబోటిక్ సర్జరీలు..టెక్నాలజీ పెరిగేకొద్దీ వైద్యరంగంలో పెనుమార్పులు వచ్చేశాయి. చాలా చోట్ల కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. కానీ..ప్రభుత్వాస్పత్రిలో ఎక్కడా అలాంటి సదుపాయాలు లేవు. ఐతే దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీలో అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది.
నిమ్స్ ఆస్పత్రి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇవాళ్టి నుంచి రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి రానున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా గవర్నమెంట్ హాస్పటల్స్ లో రోబోటిక్ సర్జరీస్ కు నిమ్స్ ఆసుపత్రి వేదిక కావడం విశేషం. నిమ్స్‌లో నిపుణులైన వైద్యులుండడంతో పాటు ఎక్కువ శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. దీంతో నిమ్స్ లో మరింత మెరుగైన సదుపాయాలను కల్పించాలని గుర్తించిన మంత్రి హరీష్ రావు రోబోటిక్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనేకసార్లు సమీక్షలు నిర్వహించి, రోబోటిక్ సేవలతో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
నిమ్స్‌లో రోబోటిక్ వైద్య సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం 32 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసింది. వైద్యనిపుణులు కంప్యూటర్ మానిటర్ సహాయంతో రోబోటిక్ హ్యాండ్స్‌ను వినియోగించి ఈ సర్జరీలు చేస్తారు. ఒకొక్కసారి ఆపరేషన్ టేబుల్‌పై శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో వైద్యులకు చేతులు అన్ని యాంగిల్స్ లో తిప్పుతూ ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు. అప్పుడు రోబోటిక్ హ్యాండ్స్ తో ఆపరేషన్ పూర్తి చేస్తారు. ఇంకా చెప్పాలంటే.. రోబోటిక్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో డాక్టర్స్ ఆపరేషన్ టేబుల్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది.. రోబోటిక్ సర్జరీని కంప్యూటర్ మానిటర్లో పర్యవేక్షిస్తూ.. వాటి హ్యాండ్‌తో ఆపరేషన్స్ చేయిస్తారు.









