AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీకి బండి.. జితేందర్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఈటల కీలక సమావేశం

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను మార్చుతారనే టాక్ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. బండి ముంబైకు బయలుదేరగా.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హస్తినకు వెళ్లడం కీలకంగా మారింది. ఇదే నేపథ్యంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఉదయం బండి సంజయ్ ముంబై వెళ్లారు. ముంబైలోని ముంబా దేవిని దర్శించుకున్న అనంతరం.. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అధ్యక్ష పదవి రెండు, మూడు రోజుల ముచ్చటేనంటూ తన సన్నిహితుల దగ్గర బండి వ్యాఖ్యనించినట్లు తెలుస్తోంది. ఈ నెల 8న వరంగల్ పర్యటనకు మోదీ రానున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష హోదాలో హాజరవుతాదో.. లేదో అంటూ కార్యకర్తల దగ్గర ఆవేదన చెందారు. ఈ తరుణంలో ఇవాళ మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుండటం, కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందనే ప్రచారం క్రమంలో ఏం జరుగబోతుందనేది టీ పాలిటిక్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ANN TOP 10